Thaar Maar Thakkar Maar Lyrical Video from God Father: సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సిన గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘’తార్ మార్ టక్కర్ మార్’’ ఎట్టకేలకు విడుదలైంది. మేకర్స్ ప్రకటించిన విధంగానే చెప్పిన సమయానికి సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం ఒక మాస్ నెంబర్ గా సాగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గాడ్ ఫాదర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పెరిట రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా ఈ సాంగ్ ను అనంత శ్రీరామ్ రచించారు. ఇక శ్రేయ ఘోషల్ తనదైన వాయిస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుమారు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ సాంగ్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచే విధంగా సాగింది. ఈ సాంగ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపించబోతున్నారు అని ముందు నుంచే ప్రచారం జరిగింది. ఇక ఈ సాంగ్ ను ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు.



కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారినా సరే సల్మాన్ ఖాన్ తో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో వారు అడిగిన వెంటనే ప్రభుదేవా ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీగా మార్కెట్ చేసిందని తెలుస్తోంది. కేవలం డిజిటల్ వర్షన్ ఒక్కటే సుమారు 56 కోట్ల రూపాయల మేర చెల్లించి సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది.


అదే విధంగా శాటిలైట్ సహా మిగతా థియేటర్ వర్షన్స్ అన్నీ కలుపుకుని మొత్తం 200 కోట్ల రూపాయల మేర మార్కెట్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నయనతార నటిస్తుండగా ఆమె భర్త పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమాని తెలుగు సహా హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సాంగ్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Also Read: Venkatesh Maha with Nani: లవ్ స్టోరీ చెప్పిన వెంకటేష్.. డైలమాలో నాని?


Also Read: SSMB 28 Shoot:అప్పుడే SSMB 28 మొదటి షెడ్యూల్ పూర్తి.. ఇంకా రచ్చ ఉంటుందన్న నిర్మాత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.